»Actress Laya Visited Srivari Temple For The First Time After Marriage
Actress Laya : పెళ్లి తర్వాత తొలిసారి శ్రీవారి ఆలయాన్ని సందర్శించిన నటి లయ
హీరోయిన్ లయ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామి (Tirumala Venkateswara Swamy)వారిని దర్శించుకుంది. కాలి నడకన అలిపిరి (Alipiri)నుంచి తిరుమల వెళ్ళింది లయ. ఒకప్పటి హీరోయిన్ లయ సినిమాలకు గ్యాప్ ఇచ్చి చాలా ఏళ్ళ తర్వాత ఇటీవలే మళ్ళీ టీవీ షోలలో కనిపిస్తుంది.
హీరోయిన్ లయ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామి (Tirumala Venkateswara Swamy)వారిని దర్శించుకుంది. కాలి నడకన అలిపిరి (Alipiri)నుంచి తిరుమల వెళ్ళింది లయ. ఒకప్పటి హీరోయిన్ లయ సినిమాలకు గ్యాప్ ఇచ్చి చాలా ఏళ్ళ తర్వాత ఇటీవలే మళ్ళీ టీవీ షోలలో కనిపిస్తుంది.
హీరోయిన్ “లయ” (Heroine Laya) తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది లయ. 1999 లో “స్వయంవరం” (Swayamvaram) సినిమా తో హీరోయిన్ గా తెలుగు తెరపై పరిచయమైన లయ ఆ చిత్రంలోని తన నటనతో అందరిని ఆకట్టుకుంది.
ఆ తరువాత ఆమె టాలీవుడ్ లో (Tollywood)పలు సినిమాల్లో నటించింది. బాలకృష్ణ, జగపతిబాబు, శివాజీ వంటి స్టార్ హీరోలతో నటించారు లయ.అయితే అదే సమయంలో తను ఎంచుకున్న కధల విషయంలో చేసిన తప్పిదాల వల్ల తెరపై అవకాశాలను కోల్పోతూ వచ్చింది. అయితే అవకశాలు తగ్గుతున్న సమయంలో ఒక ఎన్నారై ను పెళ్లి చేసుకుంది.
పెళ్లి తరువాత లాస్ ఏంజెల్స్ లో (Los Angeles)సెటిల్ అయిన లయ ఆ తరువాత సినీ పరిశ్రమ వైపు కన్నెత్తి చూడడం మానేసింది. అయితే ఆమెకు ఒక పాప, బాబు కూడా ఉన్నాడు. ఈ నేపద్యంలో కుటుంబ భాద్యతలు నిర్వర్తిస్తూ అదే సమయంలో తన భర్త బిజినెస్ లో సహాయం చేస్తుందట.
కాగా, గతంలో ఒక దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) తన అరవింద సామెత వీరరాఘవ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రకోసం లయను సంప్రదించాడట. లయ మళ్ళి ఎన్టిఆర్ సినిమాతో తెలుగులో రీఎంట్రి ఇస్తుందనే వార్త ఆమధ్య ఫిలింనగర్ (Filmnagar)లో జోరుగా వినిపించింది. కానీ ప్రస్తుతం తనకు నటనపై ఆసక్తి లేదని సున్నితంగా ఆ ఆఫర్ ను తిరస్కరించిందట