ప్రకాశం: గిద్దలూరులోని 7వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మొత్తం 18 రేషన్ దుకాణాల్లో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి కార్డుదారునికి కిలో గోధుమపిండి రూ.20కే అందజేసారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.