TG: అమ్మవారి ఆలయం నిర్మాణం కోసం కోకాపేట అనువైనది శారదాపీఠం ఉత్తరపీఠాధిపతి స్వాత్మానందేంద్ర అన్నారు. సీఎం రేవంత్‌కు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ రెండు ఎకరాల్లో వేద పాఠశాల నిర్మిస్తామని తెలిపారు. అలాగే ఆలయం, గోశాల, నిత్యాన్నదాన సత్రం నిర్మాణం కూడా చేపడతామని స్పష్టం చేశారు. కాగా కోకాపేట శారదాపీఠం భూములపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.