బృందావన్లో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఇస్కాన్ ఏర్పాటు చేస్తుందని ఉత్తరప్రదేశ్ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ వెల్లడించారు. ఇందులో భగవద్గీత, సనాతన ధర్మాలను ఇస్కాన్ బోధిస్తుందని పేర్కొన్నారు. ఈ వర్సటీ మన దేశ భవిష్యత్తు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వెయ్యేళ్ల క్రితం నాటి నలంద విశ్వవిద్యాలయ స్థాయికి ఈ అంతర్జాతీయ వర్సిటీ చేరుకుంటుందని తెలిపారు.