NGKL: జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కంటి వైద్య శిబిరం విజయవంతమైనట్లు జిల్లా ఉప వైద్యాధికారి వెంకట్ దాస్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 68 మందికి కంటి పరీక్షలు చేయగా.. 31 మందికి శస్త్ర చికిత్స చేయడానికి గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యుడు శ్రీనివాసులు, సిబ్బంది మోహన్, తదితరులు పాల్గొన్నారు.