ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. నార్త్ అమెరికాలో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. అక్కడ ఇప్పటి వరకు ఈ సినిమా $10.9 మిలియన్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.