మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మహాయుతిలోని శివసేన, ఎన్సీపీ నేతలకు మంత్రిత్వ శాఖల కేటాయింపుపై బీజేపీ పెద్దలతో చర్చిస్తున్నారు. బీజేపీ నుంచి 20 మంది, శివసేన నుంచి 12 మంది, ఎన్సీపీ నుంచి 10 మంది మంత్రులుగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఢిల్లీలోనే మకం వేశారు. డిప్యూటీ సీఎంగా కొనసాగడానికి అంగీకరించినా షిండే మాత్రం ఢిల్లీలో లేనట్లు సమాచారం.