AP: ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ గౌరవించాలని మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. YCPకి రాజీనామా చేసిన అనంతరం మాట్లాడిన ఆయన.. ‘ప్రజలు కూటమిని గెలిపించారు. కనీసం 5 నెలల సమయం కూడా ప్రభుత్వానికి ఇవ్వకుండా ధర్నాలు చేస్తామంటే ఎలా? పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. వైసీపీలో ఐదేళ్లు కార్యకర్తలందరూ ఇబ్బందిపడ్డారు. తాడేపల్లిలో కూర్చుని జగన్ ఆదేశాలిస్తారు.. కానీ క్షేత్రస్థాయిలో ఇబ్బందిపడేది కార్యకర్తలు’ అని పేర్కొన్నారు.