అడవిలో ఉండాల్సిన ఎలుగుబంటి ఇంట్లోకి వచ్చింది. రాత్రంతా ఇంట్లోనే ఉండటంతో ఆ కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడిపారు. ఈ ఘటన చత్తీస్‌ఘడ్‌లోని కాంకేరు జిల్లా ఏక్‌తార్ గ్రామంలో చోటు చేసుకుంది. నిన్న రాత్రి 11 గం.లకు ఇంట్లోకి ప్రవేశించిన ఎలుగు ఉదయం 6 గం.లకు అడవిబాట పట్టింది. దీంతో గ్రామస్థులు ఎప్పుడేం జరుగుతుందోనని హడలిపోతున్నారు.