AP: పనులు జరిగిన వెంటనే బిల్లులు ఎందుకు చెల్లించటం లేదంటూ కలెక్టర్లపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కలెక్టర్లు ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారు. కొన్ని శాఖల్లో డబ్బులు ఉండటం లేదు. కానీ ఉన్న వాటిని చెల్లించేందుకు ఆలస్యం ఎందుకు? జల్జీవన్ మిషన్ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఇంటర్నల్ రోడ్డు నిర్మాణాన్ని పునఃప్రారంభించాం. గ్రామాల్లో కనీస అవసరాలకు మనం ప్రాధాన్యం ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.