ఛత్తీస్గఢ్లో రేపటి నుంచి 15వ తేదీ వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఆగస్టు నెలలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలపై అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. రేపు మరోసారి ఆయన అధ్యక్షతన భద్రతా సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా మావోయిస్టులు లొంగిపోవాలని.. లేదా భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు.