TG: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్.. మీది ప్రభుత్వమా లేక అబద్ధాల ఫ్యాక్టరీనా అని ప్రశ్నించారు. అలాగే, కాకిలెక్కలతో ప్రజలని మోసగించడమే మీ విధానమా? అంటూ మండిపడ్డారు. అధికారం కోసం అబద్దాలు.. అధికారం దక్కిన తర్వాత పథకాల ఎగవేతకు కుంటిసాకులు అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీకి మూటలు మోసేందుకే రేవంత్ సీఎం అయ్యారని విమర్శించారు.