సిరియాలో దశాబ్దాలపాటు కొనసాగిన అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని తిరుగుబాటుదారులు కూల్చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి 1 వరకు తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ అల్ బషీర్‌ను నియమించారు. ఈ సందర్భంగా బషీర్ మాట్లాడుతూ.. సిరియాలో శాంతి, స్థిరత్వం నెలకొల్పాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. మరోవైపు ప్రజలు యుద్ధంతో విసిగిపోయారని, కాబట్టి వారు మరో యుద్ధాన్ని కోరుకోవడం లేదని తిరుగుబాటు నేత జులానీ తెలిపారు.