ఏపీ మంత్రివర్గంలోకి జనసేన నేత నాగబాబును తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగబాబుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతుంది. ఈ క్రమంలో ‘మంత్రి పదవికి మీరు అర్హులు సార్’ అంటూ తాజాగా బేబి మూవీ నిర్మాత SKN ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.