అన్నమయ్య: రాయచోటిలో నలుగురు అంతరాష్ట్ర బైక్ దొంగలను అన్నమయ్య జిల్లా పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.65 లక్షలు విలువ చేసే 37 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మదనపల్లి ప్రాంతానికి చెందిన బత్తుల వినోద్, మరో ముగ్గురు మైనర్లుగా గుర్తించారు. బైకులు రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి అభినందించారు.