తమిళ స్టార్ సూర్య నటించిన ‘కంగువా’ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై KE జ్ఞానవేల్ రాజా నిర్మించారు. అయితే ఈ మూవీ వసూళ్లను అంతగా రాబట్టలేక పోయింది. దీంతో నిర్మాత కోసం సూర్య మంచి నిర్ణయం తీసుకున్నారట. మూవీ నష్టాన్ని భర్తీ చేయడం కోసం ఆయనతో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పారట. దీనిపై త్వరలోనే ప్రకటన రానున్నట్లు సమాచారం.