బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తోన్న సినిమా ‘రామాయణ’. ఈ సినిమాలో మరో సీనియర్ యాక్టర్ సన్నీ డియోల్ భాగమయ్యారు. ఈ విషయాన్ని సన్నీ డియోల్ అధికారికంగా ప్రకటించారు. కాగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక 2026 దీపావళికి ఈ మూవీ మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల కానుంది.