డబ్బు, ఆస్తి కోసం కాదని.. తన ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నట్లు మంచు మనోజ్ తెలిపారు. మోహన్ బాబు నివాసంలో చర్చల సందర్భంగా తన బౌన్సర్లను బయటకు పంపటంతో మనోజ్ ఫైర్ అయ్యారు. ‘పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయటం సరికాదు. న్యాయం కోసం అందరినీ కలుస్తా. నా భార్యా పిల్లలకు రక్షణ లేకుండా పోయింది.. అందుకే ఈ పోరాటం’ అని మీడియాతో అన్నారు.