జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంచు మనోజ్, విష్ణు బౌన్సర్ల మధ్య తగాదా జరిగింది. విష్ణు బౌన్సర్లు మనోజ్ బౌన్సర్లను ఇంటి నుంచి బయటకు పంపుతున్న క్రమంలో ఘర్షణ తలెత్తింది. మనోజ్ భార్య మౌనికతో బౌన్సర్లు వీడియో కాల్ మాట్లాడుతుండగా విష్ణు వచ్చి వారిని బయటకు తోసేశారు. కాగా, ఇప్పటికే పోలీసులు మోహన్ బాబు ఇంటికి చేరుకుని, మనోజ్‌పై దాడి ఫుటేజ్ మాయం కావటంపై విచారణ చేపట్టారు.