ADB: ఆదిలాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల వివిధ కేసుల్లో పట్టుబడిన 13 బైక్లు, ఒక కారును ఈ నెల 12న వేలం వేస్తున్నట్లు సీఐ తెలిపారు. అదిలాబాద్ ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో జిల్లా ఎక్సైజ్ అధికారి హేమశ్రీ ఆధ్వర్యంలో వేలంపాట ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు ప్రభుత్వంచే నిర్దేశించబడిన ధరావతు సొమ్మును చెల్లించి బహిరంగ వేలంపాటలో పాల్గొనవచ్చన్నారు.