భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కోరుతూ మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌ను బీజేపీ రాష్ట్ర నేత తాండ్ర వినోద్ రావు కోరారు. ఎయిర్ పోర్ట్ ఏర్పాటు పనులు, సింగభూపాలెం చెరువు కరకట్టను పర్యటక కేంద్రంగా అభివృద్ధి, మణుగూరులో నవోదయ విద్యాలయం ఏర్పాటు, ఏజెన్సీ ప్రాంతంలో రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కోరారు.