ప్రకాశం: అమరావతిలోని అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ సభ్యులుగా ఎంపికై నామినేషన్లు వేస్తున్న సందర్భంగా మంగళవారం బీద మస్తాన్రావు, సానా సతీష్లను ఒంగోలు, గిద్దలూరు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, ముత్తుముల అశోక్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ.. పార్లమెంట్లో రాష్ట్ర తరపున తమ వాణిని గట్టిగా వినిపించాలని కోరారు.