మంచు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తి మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. మనోజ్ ఏకంగా గాయాలతో పోలీస్ స్టేషన్కు వెళ్లి తన తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు చేసినట్లు వార్తలొచ్చాయి. దీనిపై స్పందించిన మంచు ఫ్యామిలీ.. ఆ వార్తల్లో నిజం లేదని చెప్పింది. కొన్ని మీడియా సంస్థలు ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేస్తున్నాయంది. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయకండి అంటూ ప్రకటన విడుదల చేసింది.