»Petition In The Supreme Court To Set Up A National Commission For Men
Commission for Men: పురుషుల కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి సుప్రీంలో పిటిషన్
పురుషులకు కూడా నేషనల్ కమీషన్ ఫర్ మెన్(National Commission for Men) ఫోరమ్ లేదా అటువంటిది మరేదైనా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్(Petition) దాఖలైంది. వివాహిత పురుషుల ఆత్మహత్యల సమస్యను పరిష్కరించేందుకు ఈ మేరకు కమిషన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. గృహ హింస(domestic violence), కుటుంబ సమస్యతో బాధపడుతున్న పురుషుల ఫిర్యాదులను స్వీకరించి, వివాహితుల్లో ఆత్మహత్యలను(married mens suicide) నివారించేందుకు వారి మనోవేదనలను పరిష్కరించేందుకు కృషి చేయాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. మరోవైపు ప్రపంచంలోనే అత్యధిక పురుషుల ఆత్మహత్యలు భారత్లో నమోదయ్యాయని పిటిషనర్ స్పష్టం చేశారు.
గృహ హింస మహిళలకు మాత్రమే కాదు. ఈ కారణంగా పురుషులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే పెళ్లి చేసుకున్న అనేక మంది పురుషులు భార్యల వేధింపులు, బెదిరింపులు సహా పలు కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో పురుషులకు కూడా మహిళల కమిషన్ మాదిరిగా నేషనల్ కమీషన్ ఫర్ మెన్ ఫోరమ్ లేదా అటువంటిది మరేదైనా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు(Supreme Court)లో పిల్(pil) దాఖలైంది. మహేష్ కుమార్ తివారీ(manish kumar tiwari) అనే న్యాయవాది ఈ పిటిషన్(Petition)ను సమర్పించారు.
గృహహింస(domestic violence)సహా వివిధ సమస్యలతో బాధపడుతున్న వివాహితల ఆత్మహత్యల(married mens suicide) అంశంపై పరిశోధన చేయాలని కోరారు. అందుకు అవసరమైన నివేదికను రూపొందించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నేషనల్ కమీషన్ ఫర్ మెన్ ఫోరమ్ ఏర్పాటు చేస్తే బాధితుడు తమ ఫిర్యాదులను చెప్పుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. గృహ హింస బాధితులు, కుటుంబ సమస్యలు పలు సమస్యల కారణంగా ఒత్తిడికి గురవుతున్న వారి ఫిర్యాదుల(complaint)ను పరిష్కరించేందుకు అధికారులకు మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్లో న్యాయవాది కోరారు. భారత ప్రభుత్వం సరైన చట్టాన్ని రూపొందించాలని కోరారు.
గృహ హింస లేదా కుటుంబ సమస్యలు, వివాహ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వివాహిత పురుషుల ఆత్మహత్యల(married mens suicide) సమస్యపై పరిశోధన చేయడానికి లా కమిషన్(law commission) కేంద్రానికి సిఫార్సు చేయాలని తెలిపారు. అలాంటి ఫోరమ్ను ఏర్పాటు చేయడానికి అవసరమైన నివేదికను రూపొందించాలని సూచించారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి జిల్లా స్థాయిలో నోడల్ అధికారిని కూడా నియమించాలని పిటిషనర్(manish kumar tiwari) కోరారు.
కుటుంబ సమస్యలు, వివాహ సంబంధిత సమస్యల కారణంగా దేశంలో(india) పురుషుల ఆత్మహత్యల నిష్పత్తి(suicides ration) వేగంగా పెరుగుతోందని గుర్తు చేశారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా(world wide) ప్రతి ఏటా సుమారు 8,00,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పిటిషనర్ వెల్లడించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) అందించిన డేటా ప్రకారం 2021 సంవత్సరంలో భారతదేశంలో 1,64,033 మంది ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. ఈ క్రమంలో ప్రతి లక్ష జనాభాలో ఆత్మహత్యల రేటు 12గా ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఆత్మహత్యలు భారత్లో నమోదయ్యాయని పిటిషనర్ చెప్పారు.