TG: రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో కొత్తగా ఆరో తరగతిలో, 7-10 తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల గడువును మార్చి 10 వరకు పొడిగించినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ తెలిపారు. మొదట ప్రకటించిన గడువు ఫిబ్రవరి 27తో ముగిసింది. ఇప్పటివరకు 25,457 దరఖాస్తులు అందాయి.