సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచుస్తున్నారు. ఈ క్రమంలో మూవీపై సాలిడ్ న్యూస్ బయటకొచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్ మూడో వారం తర్వాత ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఆ దిశగా రాజమౌళి టీం పనిచేస్తోందట. జనవరి నుంచి వర్క్ షాపులు నిర్వహిస్తారని సమాచారం.