అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2లో శ్రీలీల ‘కిస్సిక్’ అనే ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఇది తన కెరీర్లోని తొలి ఐటెం సాంగ్. ఈ క్రమంలో శ్రీలీల కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే చివరి స్పెషల్ సాంగ్ కావాలని భావిస్తుందట. ‘ఐటెం గర్ల్’ అనే పేరు రాకుండా ఇలాంటి అవకాశాలు వస్తే నో చెప్పాలని ఫిక్స్ అయిందట. కెరీర్ మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఇలాంటి పాటలు చేస్తే.. ఆఫర్స్ కూడా ఇవే వస్తాయని అనుకుంటుందట.