అల్లరి నరేష్ సుబ్బు మంగదేవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా బచ్చలమల్లి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 20 ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి 9వ తేదీన మూడో పాట రాబోతున్నట్లు ప్రకటించారు. దీని కోసం తుని క్రీడా వికాస కేంద్రం, బచ్చలమల్లి టీం మధ్య క్రికెట్ మ్యాచ్ జరగబోతున్నట్లు తెలిపారు. అందులో గెలిచిన వారు పాటను విడుదల చేయనున్నట్లు తెలుపుతూ పోస్టర్ను విడుదల చేశారు.