AP: చిత్తూరు జిల్లా కుప్పంలో ‘పుష్ప 2’ మూవీకి బిగ్ షాక్ తగిలింది. అక్కడ ఈ సినిమాను ప్రదర్శిస్తున్న లక్ష్మి, మహాలక్ష్మి థియేటర్లు మూతబడ్డాయి. థియేటర్ల లైసెన్స్ రెన్యూవల్ చేయకుండా.. NOC సర్టిఫికెట్ లేకుండా మూవీలను రిలీజ్ చేస్తున్నారంటూ రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు నోటీసులిచ్చారు. కాగా, కుప్పంకు సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.