రానా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘ది రానా దగ్గుబాటి షో’లో నాగ చైతన్య సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కుటుంబమే నా జీవితం. అది లేకుండా నా లైఫ్‌ని చూసుకోలేను. నాకు ఒకరిద్దరు పిల్లలు చాలు. నాకు 50 ఏళ్లు వయసు వచ్చేసరికి నా పిల్లలతో సంతోషంగా గడపాలని ఉంది. మనం చిన్నప్పుడు ఎంజాయ్ చేసిన కొన్ని క్షణాలను వాళ్లతో కలిసి మళ్లీ ఆస్వాదించాలని ఉంది’ అని తెలిపారు.