సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప 2’ మూవీ పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. ఇండియాతో పాటు నార్త్ అమెరికాలో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. అక్కడ ఏకంగా 6 మిలియన్లకు పైగా డాలర్లను వసూలు చేసింది. ఈ సినిమా కేవలం ప్రీమియర్స్ డే 2 పూర్తయ్యేసరికే ఈ రికార్డు సాధించింది. ఈ వీకెండ్లో ఇది 10 మిలియన్ డాలర్లు దాటే అవకాశం ఉంది.