మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ‘విశ్వంభర’. సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్.. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక UV క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.