‘పుష్ప 2’ సినిమా పైరసీపై చిత్రబృందం స్పందించింది. పైరసీ కనిపిస్తే వెంటనే తెలపాలని మేకర్స్ విజ్ఞప్తి చేశారు. మెయిల్ ఐడీ claims@antipiracysolutions.org , వాట్సాప్ నంబరు 8978650014 ద్వారా తెలియజేయొచ్చని రిక్వెస్ట్ చేశారు. అలాగే నకిలీ డైలాగ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పుష్ప-2లోవి అని చెబుతున్నారని, అలా చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.