పార్టీలో ఇతర నాయకులు యాత్రలు చేయకుండా తన యాత్రను కొనసాగేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి యాత్ర చేస్తానంటే.. దానికి పార్టీ నుంచి అనుమతి లభించలేదు. ఈ వ్యవహారమే రేవంత్ ను చిక్కుల్లో పడేస్తోంది.
పార్టీలో ఎన్ని గ్రూపు రాజకీయాలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా తెలంగాణ పీసీసీ (Telangana PCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముందుకు వెళ్తున్నాడు. పార్టీలోని సమస్యలను అధిష్టానం చూసుకుంటుంది.. పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత నాదేనని భావించి క్షేత్రస్థాయిలోకి రేవంత్ రెడ్డి వెళ్లారు. హథ్ సే హత్ జోడో యాత్ర (Hath Se Hath Jodo Yatra విడతల వారీగా చేపడుతూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నాడు. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో రేవంత్ బిజీబిజీగా గడుపుతున్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాను దాదాపు చుట్టేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో యువకుడి మాదిరి రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడాడు. విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడి సందడి చేశాడు.
జిల్లా కేంద్రం నిజామాబాద్ (Nizambad)లో బుధవారం యువజన కాంగ్రెస్ (Youth Congress) అర్గుల్ రాజారామ్ స్మారకంగా నిర్వహిస్తున్న ఫుట్ బాల్ టోర్నమెంట్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించాడు. పోటీలను ప్రారంభించిన అనంతరం రేవంత్ రెడ్డి మైదానంలోకి అడుగు పెట్టాడు. విద్యార్థులతో పోటీ పడి మరీ ఫుట్ బాల్ ఆడాడు. గోల్ చేసేందుకు తీవ్రంగా శ్రమించాడు. చివరకు గోల్ ను సాధించి పక్కకు వెళ్లారు. రేవంత్ ఫుట్ బాల్ ఆడడంతో కాంగ్రెస్ (Congress Party) శ్రేణులు ఉత్సాహంతో కేకలు వేశారు. విద్యార్థులు రేవంత్ తో ఆడడం సంతోషంగా ఉందని తెలిపారు. తనకు ఫుట్ బాల్ ఆట ఎంతో ఇష్టమని.. కానీ ఆడేందుకు సమయం చిక్కడం లేదని గతంలో రేవంత్ రెడ్డి ఓ ఇంటర్య్వూలో తెలిపారు. ఫుట్ బాల్ (Football) ఆడుతున్న వీడియోను తన ట్విటర్ పంచుకున్న రేవంత్ రెడ్డి ‘కేసీఆర్ ఖేల్ ఖతమ్’ అని కామెంట్ చేసి పోస్టు చేశారు.
కాగా అనంతరం నిజామాబాద్ రూరల్ (Nizamabad Rural) నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి తన యాత్రను కొనసాగించాడు. రేవంత్ రెడ్డి యాత్రకు సానుకూల స్పందన లభిస్తోంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొంటున్నారు. పార్టీ సీనియర్ నాయకులు కలిసి రాకున్నా రేవంత్ యాత్రను నిర్విరామంగా కొనసాగిస్తున్నాడు. పార్టీలో ఇతర నాయకులు యాత్రలు చేయకుండా తన యాత్రను కొనసాగేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి యాత్ర చేస్తానంటే.. దానికి పార్టీ నుంచి అనుమతి లభించలేదు. ఈ వ్యవహారమే రేవంత్ ను చిక్కుల్లో పడేస్తోంది.