NLR: జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఆదేశాలతో శనివారం అర్ధరాత్రి పోలీసులు నాకాబందీ నిర్వహించారు. 1694 వాహనాలను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘిన ఘటనలపై 157 కేసులు నమోదు చేశారు. దాదాపు రూ.1.52 లక్షల జరిమానా విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 20 కేసు నమోదు చేయగా, ఓపెన్ డ్రింక్ చేస్తున్న 28 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.