ఆర్ఆర్ఆర్ తరవాత ప్రస్తుతం టాలీవుడ్లో పలు క్రేజీ మల్టీస్టారర్స్ సెట్ అవుతున్నాయి. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో మాస్ మహారాజా రవితేజ, సిద్ధు జొన్నలగడ్డ కాంబినేషన్లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తమళ్‌లో హిట్ అయినా ‘మానాడు’ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా తెరకెక్కిన ఈ మూవీ తమిళ నాట సంచలన విజయాన్ని అందుకుంది. దాంతో తెలుగులో రీమేక్ చేయాడానికి తెలుగు హీరోలు, నిర్మాతలు పోటీపడ్డారు. ముందుగా అక్కినేని నాగచైతన్య ఈ రీమేక్ చేయాలని గట్టిగా ట్రై చేశాడు. కానీ చివరగా ఈ మూవీ తెలుగు రీమేక్ హక్కులు సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. దాంతో ఈ రీమేక్‌లో రానా నటించబోతున్నట్టు చాలా రోజులుగా వినిపిస్తోంది. అయితే మధ్యలో రవితేజ పేరు కూడా వినిపించింది.
ఇక ఇప్పుడు మాస్ రాజానే ఫైనల్ చేసినట్టు టాక్. అలాగే మరో హీరోగా డీజే టిల్లు సిద్దూ జొన్నలగడ్డ ఓకే అయినట్టు సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్‌తో పాటు ఏషియన్ సునీల్ నారంగ్ కలిసి ఈ మూవీని తెలుగులో నిర్మించబోతున్నాడట. ఇక్కడ మరో విశేషమేంటంటే.. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ రీమేక్ స్క్రిప్ట్‌ని తెలుగు నేటివిటికి తగ్గట్టుగా మార్చబోతున్నట్టు తెలుస్తోంది. ఇక దర్శకుడిగా దశరథ్ పేరు వినిపిస్తోంది. ప్రభాస్‌తో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన దశరథ్.. చివరగా మంచు మనోజ్‌తో ‘శౌర్య’ చిత్రాన్ని తెరెకెక్కించాడు. ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత మానాడు రీమేక్ చేయబోతున్నట్టు సమాచారం.