తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల దాడులు(Dogs Attack) ఎక్కువవుతున్నాయి. ప్రజలపై ముఖ్యంగా బాలబాలికలపై వీధి కుక్కల దాడులు(Dogs Attack) ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు దుర్మరణం చెందిన ఘటన నుంచి కోలుకోక ముందే తాజాగా మరో ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది.

ఖమ్మం జిల్లాలో కుక్కల దాడి(Dogs Attack)లో ఐదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. పుటాని తండాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పుటాని తండాకు చెందిన బానోత్ అనే ఐదేళ్ల బాలుడు వీధిలో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆ బాలుడిపై వీధి కుక్కలు(Street Dogs)) దాడి చేశాయి. ఆ ఘటనలో బానోత్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. చుట్టుపక్కల వారు కుక్కల్ని తరిమికొట్టారు. అయితే అప్పటికే బానోత్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రి(Hospital)కి తరలించారు.
సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రి(Hospital)కి తరలించారు. అయితే అప్పటికే బాలుడి పరిస్థితి విషమించింది. దీంతో మెరుగైన చికిత్స కోసం బాలుడిని ఖమ్మం నుంచి బస్సులో ఆస్పత్రికి తరలించాలనుకున్నారు. బస్సులో హైదరాబాద్ కు వెళ్తుండగా మార్గం మధ్యలో బస్సులోనే బాలుడు ప్రాణాలు విడిచాడు. దీంతో బాలుడి కుటుంబంలో విషాదం నెలకొంది.
ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల్ని(Dogs) కట్టడి చేసే చర్యలు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్యనే ఖమ్మంలో కుక్కల దాడులు(Dogs Attack) ఐదు జరిగాయి. గతంలో హైదరాబాద్ లోని అంబర్ పేటలో కూడా కుక్కల దాడి(Dogs Attack)లో ఐదేళ్ల బాలుడు మరణించిన సంగతి తెలిసిందే.