AP: కుట్రలు, కుతంత్రాలకు వైసీపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని మహిళా సహకార ఆర్థిక సంస్థ ఛైర్పర్సన్ పీతల సుజాత విమర్శించారు. సగత ప్రభుత్వంలో నీటి కాలుష్యంతో ఏలూరులో వందల మంది ఆస్పత్రి పాలయ్యారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి 25 మంది కన్నుమూశారు. నంద్యాల, రామతీర్థం, కాకినాడ తదితర ప్రాంతాల్లో అతిసారం ప్రబలి ప్రజలు పిట్టల్లా రాలిపోయారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.