AP: రెవెన్యూ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామస్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఈ సదస్సుల షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 6 – జనవరి 8 వరకు ఈ సదస్సులు నిర్వహించనున్నారు. 22ఏ, ఫ్రీహోల్డ్, భూ ఆక్రమణలపై ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో షెడ్యూల్ ప్రకటించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.