AP: ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని మంత్రి లోకేశ్ నిర్ణయించారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు చాగంటి సూచనల మేరకు నైతిక విలువలపై పాఠ్యాంశాలు పెట్టాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.