»Protest Of Brs Women Corporators In Front Of Raj Bhavan
Mayor Vijayalakshmi : రాజ్‌భవన్ ఎదుట బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల ఆందోళన
ఎంపీ బండి సంజయ్ (Bandi sanjay) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కవితపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల ఖండించారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో.. రాజ్‌భవన్ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్న మేయర్ విజయలక్ష్మితో (Mayor Vijayalakshmi) పాటు ఎమ్మెల్యే గొంగడి సునీత, (MLA Gongadi Sunita) బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎంపీ బండి సంజయ్ (Bandi sanjay) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కవితపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల ఖండించారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో.. రాజ్‌భవన్ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్న మేయర్ విజయలక్ష్మితో (Mayor Vijayalakshmi) పాటు ఎమ్మెల్యే గొంగడి సునీత, (MLA Gongadi Sunita) బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సంజయ్ వ్యాఖ్యలకు వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఢిల్లీ, తెలంగాణలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బండి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. బండి సంజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రులు, బీఆర్ఎస్(Brs) శ్రేణులు డిమాండ్ చేశారు.
మహిళా దినోత్సవం రోజున కవిత (Kavitha) బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెను కించపరిచేలా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. అవినీతి పరులందరూ పెవిలియన్ బాట పడతారని హెచ్చరించారు. అవినీతిపరులను విచిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కవిత దొంగ దందా చేస్తున్నారని దేశం అంతా అంటున్నారని ఆయన అన్నారు. కవిత కారణంగా మహిళలు తల దించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కవితపై బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్టుకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ బండి సంజయ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. బీజేపీ ఎందుకు మహిళ గోస( Mahiḷa gosa)పేరుతో నిరసన చేపట్టిందని వారికే తెలియదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indra Reddy) అన్నారు.సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక రాష్ట్రంలో రాజకీయ విలువలు పడిపోయాయని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.
సభ్య సమాజం తలదించుకునేలా ఆయన మాటలు ఉన్నాయన్నారు. ఆ వ్యాఖ్యలు బండి సంజయ్ వ్యక్తిగతమా లేక పార్టీ వైఖరి కూడా అదేనా అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు (Women’s Reservation Bill) కోసం దీక్ష చేస్తే ఈడి నోటీసులు ఇస్తుందన్నారు. తెలంగాణలో మహిళలకు 33% కాదు, 50% రిజ్వేషన్లు అమలు చేస్తున్నామని ఆమె వెల్లడించారు. బీజేపీలో ఉన్న దొంగల మీద ఎన్ని ఈడీ కేసులు పెట్టారని ప్రశ్నించారు. మీకు ఎదురు తిరిగితే ఈడిని వేట కుక్కల్లా ఉసిగొల్పుతున్నారని సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. వ్యాపారం చేసుకునే తమ ఎంపీలు, మంత్రులు, కవిత మీద కేసులు పెట్టారని.. ఈ కేసులకు భయపడబోమని తేల్చి చెప్పారు. బండి సంజయ్, నీకు, నీ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని ఆమె ఎద్దేవా చేశారు.