»Actress Ileana D Cruz Gets Banned From Tamil Film Industry Know About Reason
Actress Ileana: ఇలియానాను బ్యాన్ చేసిన తమిళ ఇండస్ట్రీ..కారణమిదే
ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ఇలియానా(Ileana) పేరు చెబితే చాలు కుర్రకారు పిచ్చెక్కిపోయేవారు. తన అందంతో తెలుగు ఇండస్ట్రీలో పాగా వేసిన బ్యూటీ ఇలియానా. ప్రస్తుతం ఆమె చేతిలో సరైన సినిమాలు లేవు. గత కొన్నాళ్లుగా ఆమె సౌత్ మూవీస్(South Movies)కు దూరంగా ఉంటోంది. తెలుగులో ఆమెకు అవకాశాలు కూడా లేవు. తమిళంలో అయితే పూర్తిగా సినిమాలు చేయడం మానేసింది. ఇలియానా(Ileana) తమిళ సినిమాలు చేయకపోవడం వెనక ఓ పెద్ద కారణమే ఉందని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్(Viral) అవుతున్నాయి.

తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu)తో ‘పోకిరి’ సినిమాలో ఇలియానా(Ileana) నటించింది. ఆ సినిమాతో టాలీవుడ్(Tollywood)లో ఓవర్ నైట్ హీరోయిన్ గా అయిపోయింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో అటు కోలీవుడ్, ఇటు శాండిల్ వుడ్ లో మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగింది. అయితే కొన్నేళ్లుగా ఇలియానా(Ileana) హిందీ సినిమాల్లో మాత్రమే కనిపిస్తోంది. సౌత్ లో ఆమె సినిమాలు చేయడం లేదు. దీనికి పెద్ద కారణమే ఉందని బయటపడింది.
టాలీవుడ్ లో ఇలియానా(Ileana) హీరో రవితేజతో ‘దేవుడు చేసిన మనుషులు’ అనే సినిమా చేసింది. ఆ మూవీ టైంలోనే తమిళంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆ సినిమా చేయడం కోసం ఇలియానా ఓ పెద్ద నిర్మాత దగ్గర డబ్బులు కూడా తీసుకుంది. కానీ ఆ సినిమా చేయలేదు. ఇదేంటని అడిగితే డబ్బులు ఇవ్వను కానీ ఇంకో సినిమా చేస్తాను అని చెప్పింది. దీంతో ఆ పెద్ద నిర్మాత సీరియస్ అయ్యాడు. కోలీవుడ్ నడిగర్ సంఘంతో పాటు సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కూడా ఇలియానా(Ileana)పై ఫిర్యాదు చేశాడు. దీంతో ఇలియానాకు పదేళ్ల పాటు సౌత్ సినిమా(South Movies)ల్లో నటించకూడదని బ్యాన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. ఈ వార్తను విన్న నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు.