YS Avinash Reddy : క్రైమ్ థ్రిల్లర్‌ని తలపిస్తోన్న వివేకా హత్య కేసు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు క్రైమ్ థ్రిల్లర్‌ని తలపిస్తోంది. విచారణ సాగే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం సీబీఐ (CBI) కోర్టులో విచారణ జరుగుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తో(YS Avinash Reddy) పాటు పలువురు ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత నెలలో హైదరాబాద్ (Hyderabad) సీబీఐ కోర్టులో ఈ కేసు విచారణ నడుస్తున్నది. వివేకా రెండో భార్య కొడుకును వారసుడిగా ప్రకటించే ప్రకటించే ప్రక్రియలో ఆయన హత్య జరిగి ఉండొచ్చని ఎంపీ అవినాష్ ఆరోపించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు క్రైమ్ థ్రిల్లర్‌ని తలపిస్తోంది. విచారణ సాగే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం సీబీఐ (CBI) కోర్టులో విచారణ జరుగుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తో(YS Avinash Reddy) పాటు పలువురు ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత నెలలో హైదరాబాద్ (Hyderabad) సీబీఐ కోర్టులో ఈ కేసు విచారణ నడుస్తున్నది. వివేకా రెండో భార్య కొడుకును వారసుడిగా ప్రకటించే ప్రకటించే ప్రక్రియలో ఆయన హత్య జరిగి ఉండొచ్చని ఎంపీ అవినాష్ ఆరోపించారు. 2010 లో షేక్ షమీన్ అనే మహిళను వివేకా వివాహం (Marriage) చేసుకున్నారని రెండో వివాహంతో ఆయన కూతురు సునీతతో సంబంధాలు దెబ్బతిన్నాయని అవినాష్ తెలిపారు. 2015లో షమీన్,(Shameen) వివేకాకు కొడుకు పుట్టాడాని దాంతో వారు తమ కుటుంబం నుంచి దూరంగా ఉండాలంటూ సునీత బెదిరించిదని ఆయన అన్నారు.సీబీఐకి ఇచ్చిన వాగ్మూలంలో షమీమ్ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పింది.
రెండో వివాహం తర్వాత వివేకా చెక్ పవర్‌ను తొలగించారు. సునీత, వివేకా సతీమణి హైదరాబాద్‌లో ఉంటే.. వివేకానంద రెడ్డి (Vivekananda Reddy)మాత్రం ఒంటరిగా పులివెందులలో ఉండేవారు. షమీమ్‌కు పుట్టిన కుమారుడిని వారసుడిగా ప్రకటిస్తారని చర్చ జరిగిన నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చు. హత్య (Murder) తర్వాత నిందితులు వివేకా ఇంట్లో డాక్యుమెంట్ల కోసం వెతికినట్లు షమీమ్ చెప్పడం దీనికి బలం చేకూరుస్తుందని అవినాష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఇన్ని రోజులు తాను మౌనంగా ఉండటంతో పార్టీ క్యాడర్ తనను ప్రశ్నిస్తోందని… ఇక నుంచి మాట్లాడటం మొదలుపెడతాని అవినాష్ రెడ్డి వెల్లడించారు. వివేకా ది మర్డర్ ఫర్ గెయిన్ అన్నారాయన. ముస్లిం మహిళకు పుట్టిన కొడుకును రాజకీయ వారసుడిగా ప్రకటించాలని వివేకా నిర్ణయం తీసుకున్నారని.. ఆయన పేరును కూడా ముస్లిం పేరుగా మార్చుకున్నారని ఆయన ఆరోపించారు.ఆస్తులన్నీ వాళ్లకి వెళ్లిపోతాయని.. రాజకీయ వారసులుగా వస్తారని.. సునిత భర్త రాజశేఖర్(Rajasekhar) కుట్ర చేశారన్నది తన అనుమానని అవినాష్అన్నారు.
హత్య జరిగిన ప్రాంతంలో లేఖను మాయం చేశారు. నేను ఎక్కడా గుండెపోటు (heart attack) అని చెప్పలేదని అవినాష్ రెడ్డి అన్నారు. సీబీఐ విచారణ వ్యక్తి టార్గెట్‌గా జరుగుతోందని… అప్రూవర్‌గా మారిన వ్యక్తి ఇచ్చిన వాగ్మూలంలో ఇదంతా ఉన్నప్పటికీ ఈ కోణంలో సీబీఐ ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. తాను గుండె పోటు అని చెప్పినట్టు టీడీపీ(TDP) వారు చిత్రీకరించారు. కుటుంబ సభ్యులు చెబితేనే తాను హత్య జరిగిన ఇంటికి వెళ్లానని ఆయన తెలిపారు.ఇక ఈ కేసు విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 31కి వాయిదా వేసింది. కేసు విచారణలో భాగంగా చంచల్‌గూడ జైలులో(Chanchalguda prison)రిమాండ్ ఖైదీలుగా ఉన్నా సునీల్ కుమార్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. గంగిరెడ్డి (Gangireddy)సైతం సీబీఐ కోర్టుకు వచ్చారు. కేసు విచారణ వాయిదా పడిన తర్వాత ముగ్గురు నిందితులను పోలీసులు మళ్లీ చంచల్‌గూడ జైలుకు తరలించారు.