PK ఆడిస్తోన్న Drama ఇదీ.. లిక్కర్ స్కామ్‌పై రేవంత్ రెడ్డి
Revanth reddy on Liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (delhi liquor scam) కవిత (kavitha) ఈడీ (ed) విచారణపై ఈ రోజు ప్రధాన రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ న్యూట్రల్‌గానే ఉంది. ఇదే అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ లబ్ది కోసం చర్చ జరిగేలా చేస్తున్నాయని ఆయన (revanth reddy) ఆరోపించారు.
Revanth reddy on Liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (delhi liquor scam) కవిత (kavitha) ఈడీ (ed) విచారణపై ఈ రోజు ప్రధాన రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ న్యూట్రల్‌గానే ఉంది. ఇదే అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ లబ్ది కోసం చర్చ జరిగేలా చేస్తున్నాయని ఆయన (revanth reddy) ఆరోపించారు. ఇదంతా ప్రశాంత్ కిశోర్ ఆడిస్తోన్న నాటకం అని కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి (revanth reddy) పాదయాత్ర జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో కొనసాగుతోంది. ముత్యంపేట గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చేలా.. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరించేలా పీకే చెప్పినట్టు ఆ రెండు పార్టీలు పథకం అమలు చేస్తున్నాయని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ తలచుకుంటే గంటలో కవితను అరెస్ట్ చేయొచ్చు అని స్పష్టంచేశారు. కవితను (kavitha) జైలుకు తరలించడానికి ఇన్ని గంటల సమయం తీసుకుంటారా? అని అడిగారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ రెండు పార్టీలు డ్రామాకు తెరతీశాయని ఆరోపించారు.
కవిత (kavitha) అరెస్ట్ అయిన వెంటనే కేసీఆర్ (kcr) వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తారని రేవంత్ చెప్పారు. బీజేపీ కూడా రోడ్డెక్కుతుందని.. ఇదీ పీకే స్ట్రాటజీ అని రేవంత్ విమర్శించారు. పార్లమెంట్లో అదానీ అంశం చర్చకు వస్తుందనే బీజేపీ లిక్కర్ స్కామ్ తెరపైకి తీసుచొచ్చిందని ఆరోపించారు. పిల్లాడిని కుక్కలు చంపేస్తే పట్టించుకోలేదు.. మహిళలపై దాడులు జరిగితే రియాక్ట్ అవరు. లిక్కర్ స్కామ్‌లో కవిత విచారణకు హాజరైతే మాత్రం నలుగురు ఢిల్లీకి వెళ్లారు అని రేవంత్ రెడ్డి (revanth reddy) మండిపడ్డారు.
లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను ( kavitha) ఈడీ అధికారులు విచారిస్తున్నారు. రాత్రి 8 గంటల వరకు విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు వ్యక్తిగత వివరాలు అడిగారని సమాచారం. మొబైల్ ఇవ్వాలని కోరితే.. కవిత ( kavitha) అధికారులు ఇచ్చారట. అయితే మహిళను సాయంత్రం 6 గంటలు దాటితే విచారించొద్దు.. అరెస్ట్ చేయొద్దు అని నిబంధనలు ఉన్నాయి. కవితను ( kavitha) విచారిస్తోంది ఈడీ జాయింట్ డైరెక్టర్ లేడీ ఆఫీసరే కావడంతో.. ఆ నిబంధన వర్తించదని మరికొందరు అంటున్నారు. ఏం జరగుతుందో చూడాలీ.