Tollywood లో రేసులోకొచ్చిన మహేష్.. ప్రభాస్, చరణ్‌తో పోటీ తప్పదా!?
Tollywood Heros : ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు.. ఈ ముగ్గురు బడా హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. థియేటర్ల వద్ద మాస్ జాతర జరుగుతుంది.. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ పీక్స్‌లో ఉంటుంది. ఇప్పుడు వచ్చే సంక్రాంతికి ఇదే జరగబోతోందనే ప్రచారం జరుగుతోంది.
ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు.. ఈ ముగ్గురు బడా హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. థియేటర్ల వద్ద మాస్ జాతర జరుగుతుంది.. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ పీక్స్‌లో ఉంటుంది. ఇప్పుడు వచ్చే సంక్రాంతికి ఇదే జరగబోతోందనే ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి అంటేనే సినిమా పండగ. పోయినసారి చిరంజీవి, బాలకృష్ణతో పాటు దిల్ రాజు ‘వారసుడు’ కూడా బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్లో పోటీ పడ్డారు. కానీ వచ్చేసారి పాన్ ఇండియా వార్ జరగబోతోంది. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ని జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోంది. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇక రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న ఆర్సీ 15ని.. దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కూడా సంక్రాంతికే తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు దిల్ రాజు. కానీ ఇప్పుడు మహేష్ కూడా సంక్రాంతికే వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. కానీ ఇప్పుడది సాధ్యమయ్యేలా లేదంటున్నారు. అందుకే ఇప్పుడు మహేష్ ముందు సంక్రాంతినే బెస్ట్ ఆప్షన్‌గా ఉందని తెలుస్తోంది. అదే జరిగితే 2024 సంక్రాంతి వార్ ఓ రేంజ్లో ఉంటుందనే చెప్పాలి. అయితే అప్పటి వరకు.. ఈ ముగ్గురిలో ఎవరు బరిలో నిలుస్తారో.. ఇప్పుడే చెప్పలేం.