PLD: సీఎం చంద్రబాబు శనివారం వినుకొండలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:40 గంటలకు హెలికాప్టర్ ద్వారా వినుకొండ చేరుకుంటారు. అక్కడ ‘స్వచ్ఛ రథాన్ని’ ప్రారంభించి, అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పార్టీ కార్యకర్తలతో సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.