Ramcharan : ఆమెతో నటించాలనుంది : అమెరికన్ షోలో రాం చరణ్
Ram charan : ఆర్ఆర్ఆర్ సినిమాతో, నాటు నాటు పాటతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న నటుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. దీంతో అమెరికన్ టాక్ షోల్లో ఇంటర్య్వూలు ఇస్తూ తన భావాలను పంచుకుంటున్నారు రాం. ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Ram charan : ఆర్ఆర్ఆర్ సినిమాతో, నాటు నాటు పాటతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న నటుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. దీంతో అమెరికన్ టాక్ షోల్లో ఇంటర్య్వూలు ఇస్తూ తన భావాలను పంచుకుంటున్నారు రాం. ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హాలీవుడ్లో ఎవరితో నటించాలని ఉంది అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. హాలీవుడ్లో ప్రముఖ యాక్ట్రస్ జూలియా రాబర్ట్స్‌తో కలిసి నటించాలని ఉందంటూ చెప్పుకొచ్చారు. ఆమె సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేసినా చాలు అంటూ తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.
అలాగే హాలీవుడ్లో ఎప్పుడు డెబ్యూట్ చేస్తున్నారు అనే ప్రశ్నకూ ఆయన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఓ హాలీవుడ్ ప్రొడ్యూసర్‌తో టాక్స్‌లో ఉన్నానని చెప్పారు. కథలు చర్చల్లో ఉన్నాయని అవి ఫైనలైజ్ అయిన తర్వాత మాత్రమే డెబ్యూట్ గురించి చెబుతానని ఆయన వివరించారు. దీంతో మరి కొన్ని రోజుల్లో తమ హీరోని బాలీవుడ్‌లోనూ చూడబోతున్నాం అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రాంచరణ్ నటిస్తున్న RC15 అనే మూవీ షూటింగ్ జరుగుతోంది. మరి కొన్ని సినిమాలపైనా ఆయన సైన్ చేసినట్లు తెలుస్తోంది.