ఆడవారిలో ఎక్కువగా కనిపించే సమస్య రక్తహీనత. అంజీరాతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంజీరా పండు నేరుగా తిన్నా, డ్రైఫ్రూట్ తిన్నా శరీరానికి పోషకాలు పుష్కలంగా అందుతాయి. దీనిలోని ఐరన్, కాల్షియం రక్తహీనతను దూరం చేస్తుంది. నెలసరి సమయంలో ఉసిరిపొడితో కలిపి ఈ పండుని తింటే మెరుగైన ఫలితాలుంటాయి. అంజీరా హార్మోన్ల హెచ్చుతగ్గుల్ని క్రమబద్ధీకరిస్తుంది. మెనోపాజ్ ఇబ్బందులు తొలగిపోతాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.