WG: ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో కోటి రూపాయల వ్యయంతో రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు ఏఈ నిమ్మల విజయ్ కుమార్ శనివారం తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రతిపాదించిన 23 పనుల్లో 19 పనులకు ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయని, నిధులు కూడా మంజూరయ్యాయని పేర్కొన్నారు. వారం రోజుల్లో ఈ పనులను ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు.