»Alert For Residents Of Hyderabad Good Water Supply Bandh For 2 Days
HMWSSB : హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. 2 రోజుల పాటు మంచి నీటి సరఫరా బంద్
హైదరాబాద్ (Hyderabad) వాసులకు బిగ్ అలర్ట్. నగరంలో పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు మంచి నీటి సరఫరా (Water supply) నిలిచిపోనుంది. సిద్ధిపేట (Siddipet) జిల్లా కుకునూర్‌పల్లి వద్ద రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు… కొండపాక నుంచి హైదరాబాద్ నగరానికి మంచినీళ్లు సరఫరా చేస్తున్న 3000 mm డయా ఎంఎస్ మెయిన్ పైపులైన్‌ను పక్కకు మార్చనున్నారు.
హైదరాబాద్ (Hyderabad) వాసులకు బిగ్ అలర్ట్. నగరంలో పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు మంచి నీటి సరఫరా (Water supply) నిలిచిపోనుంది. సిద్ధిపేట (Siddipet) జిల్లా కుకునూర్‌పల్లి వద్ద రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు… కొండపాక నుంచి హైదరాబాద్ నగరానికి మంచినీళ్లు సరఫరా చేస్తున్న 3000 mm డయా ఎంఎస్ మెయిన్ పైపులైన్‌ను పక్కకు మార్చనున్నారు. ఈ క్రమంలో మార్చి 9న ఉదయం 6 గంటల నుంచి 10 అర్ధరాత్రి 12 గంటల వరకు దాదాపు 48 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు.మొదట మార్చి 8న నుంచి ఉదయం 6 గంటల నుంచి నీటి సరఫరా నిలిపి వేయాలనుకున్నప్పటికీ హోలీ పండుగ (holi fastical) దృష్ట్యా ఒకరోజు ముందుకు జరిపారు. కావున మార్చి 9న ఉదయం 6 గంటల నుంచి 10 అర్ధరాత్రి 12 గంటల వరకు నీటి సరఫరా నిలిచిపోనుంది.
మనోహరాబాద్(Manoharabad) -కొత్తపల్లి మధ్య ప్రతిపాదించిన కొత్త రైల్వై ట్రాక్ నిర్మాణ పనులు మొదలవ్వనున్నాయి. ఈ క్రమంలో కుకునూర్‌పల్లి వద్ద గోదావరి తాగునీటి సరఫరా పథకం-ఫేజ్-1 పైప్‌లైన్ మార్గాన్ని పక్కకు మార్చనున్నారు. ఈ కారణంతో సిటీ పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఆటంకం కలుగుతుందని వాటర్ సప్లై బోర్డు తెలిపింది. అంతరాయాన్ని మన్నించి నీటిని పొదుపుగా వాడుకోవాలని నగర ప్రజలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) సూచించింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 8 లక్షల నల్లాలకు నీళ్లు సరఫరా ఆగిపోనుంది. నీటి సరఫరా నిలిచిపోనున్న ప్రాంతాలుహైదరబాద్ శివారులోని షాపూర్, చింతల్, జీడిమెట్ల, వాణి కెమికల్స్, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, సూరారం, మల్కాజిగిరి డిఫెన్స్ కాలనీ, దమ్మాయిగూడ, నాగారం, కొంపల్లి, కీసర, బొల్లారం, గుండ్ల పోచంపల్లి, ఘన్పూర్ (మేడ్చల్/శామీర్‌పేట), కంటోన్మెంట్ ప్రాంతం, ఎంఈఎస్, తుర్కపల్లి బయోటెక్ పార్కు, కాప్రా మున్సిపాలిటీ పరిధితో పాటు కొండపాక, ప్రజ్ఞాపూర్, ఆలేరు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది.